Wednesday, 22 July 2020

మేషరాశి (Aries) వారి జన్మ ఫలితాలు | మీ పుట్టిన తేది March 21 - April 19 ...

హాయ్ ఫ్రెండ్స్ , Daily World Visit ఛానల్ : http://bit.ly/2NcmDkI కి స్వాగతం,
Watch► మేషరాశి (Aries) వారి జన్మ ఫలితాలు | మీ పుట్టిన తేది March 21 - April 19 మధ్యలో ఉంటె వారి జాతకం

మన వేదాలలో సూర్యుని గమనాన్ని బట్టి 12 రాసులుగా విభజించారు, వాటిలో మొదటి రాశి మేషరాశి

సూర్యుడు మేషం సంచరించే కాలం మేషరాశిగా వ్యవహరిస్తారు. అశ్వని నక్షత్రపు నాలుగు పాదాలు, భరణి నక్షత్రపు నాలుగు పాదాలు, కృత్తిక నక్షత్రపు తొలి పాదం మేషరాశిగా వ్యవహరిస్తారు. ఈ నక్షత్ర సమూహం మేక ఆకారంలో ఉంటుంది కనుక మేషం అంటే మేక అని మరో అర్థం కనుక ఇది మేషరాశి అయింది. సూర్యుడు ఒక మాసకాలం ఈ రాశిలో ఉండి ఆతరువాత వృషభరాశిలో ప్రవేశిస్తాడు

మేషరాశి వారి జీవితములో ఒడిదుడుకులు ఎక్కువ. అధికముగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు. బాల్యములో కష్టాలు అనుభవిస్తారు. యవ్వనములో స్నేహితులకు బంధువులకు దూర ప్రాంతాలకు వెడతారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురౌతాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావము చిన్న వయసులోనే అవగతమౌతుంది. స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు. అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని బంధువులు ఎదురు చూస్తారు. బంధువర్గములో అస్థుల కొరకు వేచి ఉండే వారు అధికము. భార్య వైపు బంధువులు కొంత కాలము పెత్తనము సాగిస్తారు. అనేక కారణాల వలన మంచి వారిని ఆదరించ వలసిన అవసరము ఏర్పడుతుంది. పరాయి స్త్రీల వలన ఇబ్బందికి గురి ఔతారు. సాహస క్రీదల పట్ల అభిమానము మెండు. క్రీడలు, సాంకేతికము, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు. భాగస్వాములతొ కలిగే విభేదాలు జీవితములో మలుపును తెస్తాయి. లిఖిత పుర్వకమైన విషయాలను ఇతరులకు చెప్పింనంతగా తాము ఆచరించరు.

మనోధైర్యముతో తిసుకునె సాహస నిర్నయాలు కలిసి వస్తాయి. అనుభ్వ లేకుండ చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి. వైద్యరంగములో రాణిస్తారు. అబద్ధాలు చెప్పడనికి ఇష్టపడరు. సొమరితనమంటే అయిష్టము. కుటుంబములో ఐక్యత ప్రశాంతత ఉన్నంత కాలము వెలుపలి ప్రపంచములో విజయపధంలో మనగలరు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితములో రాణిస్తారు. సుభ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ పుజల వలన సమస్యలను అధిగమించగలరు. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదము కానంత వరకు ప్రతిష్తకు భంగము లేదు. స్త్రీలకు సంతానము, జీవిత భాగస్వామి విషయములో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసి పోతాయి. జ్యేష్ట సంతానము విషయములో జాగ్రత్త వహించాలి. ఆడంబరము లేని పూజలు, గుప్తదానాలు, మనోధైర్యము మేలు చేస్తాయి. సహాయ సహకారాలు కోరేవారు అందరూ అవకాస వాదులు కారని గుర్తించాలి. తూర్పు, ఉత్తర సింహద్వారాలు కలసి వస్తాయి. గురువారము చెసే విష్ణు పూజలు మేలు చెస్తాయి.

రాశులవారీగా తీసుకుంటే ప్రథమ రాశి మేషం. ఈ రాశిని అగ్నితత్త్వంతో పోలుస్తారు. భగభగమండే తత్త్వంతో ఉండి, కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. తోచిన విధంగా ప్రవర్తించడం వంటి లక్షణాలతో ఉంటారు. ఈ రాశికి కుజుడు అధిపతి. చర రాశి అయినందున స్థిరమైన ఆలోచన ఉండదు. చకచకా ఆలోచనలు, నిర్ణయాలు మారిపోతుంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. అగ్నితత్త్వం అయినందున ఆయా ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం ఈ రాశివారిలో అత్యంత సహజం. నాయకత్వం వహించాలనే తపన, తొందరపాటుతనం కనిపిస్తాయి. చురుకుదనంతో నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు. క్షత్రియ రాశి కూడా అయినందున పురుషాహంకారంతో శక్తిమంతుడుగా ఉంటారు. పట్టుదల, కార్యసాధన లక్షణం కలిగి ఉంటారు. దీనివల్ల మొండితనం అబ్బుతుంది. మాట నెగ్గించుకోవడంకోసం క్రూరత్వం వహించే అవకాశం ఉంది.

మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామీని పూజిస్తే మంచిది, వీరికి అదృష్ట రంగు ఎరుపు , వీరికి ఆకుపచ్చ రంగు గల దుస్తులు, ఉంగరాలు ధరిస్తే కీడు జరుగుతుంది అని చెప్పబడినది, వీరి అదృష్ట సంఖ్య 7, ఒకవేళ వీరు రత్నాన్ని ధరించాలి అంటే వీరి అదృష్ట రత్నము వైడూర్యం
బరువు 4 క్యారెట్లు ఉండాలి , వీరు ఒక పని మొదలుపెట్టాలి అంటే వీరికి అనుకూలమైన వరం మంగళవారం, వీరు ఎట్టిపరిస్థితులలో బుధవారం ఈ పని మొదలుపెట్టకూడదు, వీరు తరచు వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు

మేము ప్రతిరోజూ ఒక సరికొత్త విషయాన్నీ మీకు తెలియజేస్తాము, అది జ్యోతిష్యం, వాస్తు, ఆరోగ్యం, ప్రకృతి, సరికొత్త పరికరాలు ఇలా మీకు నచ్చినది, మీరు కోరేది మేము మీకు అందచేస్తాము,

మా ఛానల్ సంప్రదించవలసిన మెయిల్ : teluguf3@gmail.com
ఫోన్ నెంబర్ : 949 329 1700

We will tell you a new thing every day, astrology, Ancient Architecture, Health, Nature, new equipment, we will give you whatever you want,

The mail to contact our channel is: teluguf3@gmail.com
Phone Number: 949 329 1700

Daily World Visit
#dailyworldvisit #DWV #Astrology #TeluguWeeklyHoroscope #dharmasandehalu #AstroSciencePlants #herbalplants #medicinalplants #herbalmedicine #earnmoney #plantsbenefits #rasiphalalau

మీకు నచ్చితే మా ఛానల్ ని SUBSCRIBE :
http://bit.ly/2NcmDkI చేసుకోండి , అలాగే షేర్ చేయండి, ఇంకా మీకు ఏమైనా విషయాలు తెలుసుకోవాలంటే మాకు కామెంట్ చెయ్యండి.